ADB: ఇంద్రవెల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఆదిలాబాద్ MP నగేశ్ ఆదివారం పర్యటించారు. గ్రామానికి వచ్చిన ఆయనకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ గెలుపునకు అనుసరించాల్సిన విధి విధానాలపై నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రితేష్ రాథోడ్, తుకారం, దీపక్, తదితరులున్నారు.