PLD: కృష్ణా నదికి ఎగువ నుంచి వస్తున్న వరద నీరు తగ్గడంతో నాగార్జునసాగర్ మొత్తం 26 గేట్లు మూసి వేశారు. దసరా సెలవుల చివరి ఆదివారం కావడంతో సాగర్ డ్యామ్ గేట్లు తెరిచారన్న సమాచారంతో అధిక మంది పర్యాటకులు నాగార్జునసాగర్‌కు చేరుకున్నారు. ఉదయం నుంచి సాగర్ గేట్లు తెరిచి ఉండడంతో పర్యాటకులు సాగర్ అందాలను ఆస్వాదించారు.