SRD: సింగూర్ ప్రాజెక్టులో వరద తగ్గుముఖం పట్టడంతో 10 మూసివేసి, కేవలం ఒక్క గేటు ఓపెన్ ఉంచినట్లు అధికారి స్టాలిన్ ఆదివారం సాయంత్రం తెలిపారు. ప్రాజెక్టులోకి 12,536 క్యూసెక్కులు వరద చేరుతోందని చెప్పారు. అయితే యావరేజ్ అవుట్ ఫ్లో 10,244 క్యూసెక్కులున్నారు. ప్రాజెక్టు కెపాసిటీ 29.917 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 18.037 టీఎంసీలు నిల్వ ఉన్నట్లు పేర్కొన్నారు.