SRD: ప్రతి ఉద్యోగికి ఉద్యోగ విరమణ సహజమని టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి అన్నారు. సంగారెడ్డిలోని ఫంక్షన్ హాల్లో గిరిజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వయోజన విద్య డిప్యూటీ డైరెక్టర్ గోవిందరాం ఉద్యోగ విరమణ సభ ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చేందుకు గోవిందరాం ఎంతో కృషి చేశారని చెప్పారు.