HYD: ఐటీ కారిడార్లో ట్రాఫిక్ రద్దీ తగ్గించడానికి TGSRTC కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజా రవాణాను పెంచే లక్ష్యంతో ఈ నెల నుంచి ఆ ప్రాంతంలో కొత్త మెట్రో డీలక్స్ బస్సులను ప్రవేశపెట్టనుంది. ఈ బస్సులను కార్పొరేట్ ఐటీ కంపెనీలకు అద్దె ప్రాతిపదికన అందించనుంది. ముఖ్యంగా, రాత్రి షిఫ్టుల్లో పనిచేసే ఉద్యోగులకు ఈ సౌకర్యం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అధికారులు తెలిపారు.