అన్నమయ్య: కాణిపాకం శ్రీ వరసిద్ది వినాయక స్వామివారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమిషనర్ చావలి సునీల్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికారు. ఇందులో భాగంగా దర్శన ఏర్పాట్లు చేసి స్వామి వారి తీర్థ ప్రసాదాలు శేషవస్త్రం చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో రవీంద్రబాబు, సూపర్డెంట్ వాసు పాల్గొన్నారు.