ADB: గుడిహత్నూర్లోని జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ లారీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మండలంలోని సీతాగొంది గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై ఆదివారం రెండు లారీలు ఢీకొన్నాయి. దీంతో అకస్మాత్తుగా భారీ మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఓ లారీ పూర్తిగా దగ్ధమయింది. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.