KMM: మధిర మండల సీపీఐ నాయకులు ఖమ్మంలో జరిగిన ఆహ్వాన సంఘ సన్నాహక సమావేశానికి హాజరయ్యారు. డిసెంబర్ 26న ఖమ్మం నగరంలో జరగనున్న సీపీఐ శత వసంతాల ముగింపు బహిరంగ సభ విజయవంతం కోసం ఈ సమావేశం నిర్వహించారు. సీపీఐ జాతీయ కార్యదర్శి డీ.రాజా పాల్గొని మార్గదర్శకత్వం వహించారు. ఈ సమావేశానికి మధిర మండల కార్యదర్శి ఊట్ల కొండలరావు, రైతు సంఘం నాయకులు శేషగిరిరావు, మురళి ఉన్నారు.