ELR: ఈ నెల 18 వరకు జిల్లా వ్యాప్తంగా యాక్ట్ 30 అమల్లో ఉందని ఏలూరు DSP శ్రావణ్ కుమార్ ఆదివారం తెలిపారు. ఎవరైనా పబ్లిక్ మీటింగ్లు, ప్రదర్శనలు, ర్యాలీలు నిర్వహించాలంటే కచ్చితంగా స్థానిక పోలీసుల అనుమతి తప్పనిసరి అన్నారు. ఒకవేళ స్థానిక పోలీస్ అధికారులు సభలకు అనుమతి ఇచ్చినా శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తే వాటిని రద్దు చేసే అవకాశం ఉందన్నారు.