GNTR: మంగళగిరి పరిధి నవులూరులో గంజాయి విక్రయిస్తున్న ఆరుగురిని అరెస్ట్ చేసి, 2 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రూరల్ స్టేషన్లో సీఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. గంజాయి విక్రయిస్తున్న చందు, ఆనంద్, రవి, తేజ, చైతన్య, లక్ష్మణరావులని అరెస్ట్ చేశామన్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు చెప్పారు. వీరు పాడేరు నుంచి గంజాయి తెచ్చి ఇక్కడ విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు.