TG: ఎమ్మెల్యే పదవికి తాను రాజీనామా చేస్తున్నట్లు జరుగుతోన్న ప్రచారాన్ని మాజీ మంత్రి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఖండించారు. రాజీనామా ప్రచారం వాస్తవం కాదని స్పష్టం చేశారు. ‘‘నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం లేదు. నేనంటే గిట్టనివాళ్లు దుష్ప్రచారం చేస్తున్నారు. ఎవరూ నమ్మొద్దు’’ అని విజ్ఞప్తి చేశారు.