WGL: నర్సంపేట మండలం పాత ముద్దాపురం, జీజీఆర్ పల్లె గ్రామాల్లో ఆదివారం బీఆర్ఎస్ ఎన్నికల పరిశీలకులు నామాల సత్యనారాయణ ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేశారు. శ్రీనివాస్ మాట్లాడుతూ.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల హామీలను అమలు చేయకుండా మోసం చేయడం సరికాదన్నారు.