KDP: రాష్ట్రంలో మహిళలకు కూటమి సర్కార్ త్వరలో శుభవార్త చెప్పనుంది. సూపర్ సిక్స్ హామీలలో ‘ఆడబిడ్డ నిధి’ పథకాన్ని అమలు చేయడానికి చర్యలు ప్రారంభించింది. ఈ పథకం ద్వారా ఆర్థికంగా అర్హులైన మహిళలకు నెలకు రూ.1,500 చొప్పున ఆర్థిక సహాయం అందించనుంది. మహిళలకు సాధికారత కల్పించడమే ఈ పథకం లక్ష్యం. మరోవైపు ప్రభుత్వం ఈ పథకం కోసం రూ.3,300 కోట్లు కేటాయించినట్లు తెలుస్తోంది.