KRNL: జిల్లా 4వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సీఐ విక్రమ్సింహ ఇవాళ రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఆరోగ్య లేదా వ్యక్తిగత సమస్యలు ఉంటే సహాయం అందిస్తానని, పదేళ్లుగా కేసులు లేని వారి షీట్లు తొలగించే విషయాన్ని, పై అధికారులతో చర్చిస్తానని చెప్పారు. సత్ప్రవర్తన కలిగిన వారికి తోడ్పాటు, తప్పు చేసే వారిపై నిఘా కొనసాగుతుందని హెచ్చరించారు.