ASF: గణేష్ నిమజ్జనం, దేవి నవరాత్రులలో హిందూ బంధువులపై పోలీసులు పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని హిందూ ఉత్సవ కమిటీ, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో అసిఫాబాద్ పట్టణ బంద్‌కు రేపు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. పట్టణంలోని అన్ని దుకాణాలు స్వచ్ఛందంగా బంద్ పాటించాలన్నారు. ప్రజలు బంద్‌లో పాల్గొని, విజయవంతం చేయాలని కోరారు.