అన్నమయ్య: జిల్లాలో ఆదివారం విషాదం చోటు చేసుకుంది. సంబేపల్లి వద్ద చెరువులో ఈతకు వెళ్లిన ఇద్దరు యువకులు మృత్యువాతపడ్డారు. మృతుల్లో ఒకరు మదనపల్లె అమ్మచెరువు మిట్టకు చెందిన యువకుడుకాగా, మరొకరు సంబేపల్లెకు చెందిన బంధువుల కుమారుడు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.