నేపాల్‌లో భారీ వర్షాల వల్ల సంభవించిన ప్రాణనష్టం చాలా బాధాకరమని ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. ఈ కష్టకాలంలో నేపాల్ ప్రజలు, ప్రభుత్వంతో భారత్ అండగా నిలబడుతుందని పేర్కొన్నారు. స్నేహపూర్వక పొరుగు దేశంగా, నేపాల్‌కు అవసరమైన ఎలాంటి సహాయం అందించడానికైనా భారత్ కట్టుబడి ఉంటుందని ప్రధాని మోదీ ‘X’ వేదికగా భరోసా ఇచ్చారు.