ADB: భీంపూర్ మండలంలోని అంతర్గావ్ గ్రామానికి చెందిన గుండ ప్రకాష్, వందన దంపతుల కుమార్తె గుండ అంకిత ఇటీవల జగిత్యాల ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సాధించింది. ఈ సందర్భంగా ఆమెను గ్రామస్థులు అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు. పిల్లలకు నచ్చిన రంగాన్ని ఎంచుకునేలా తల్లిదండ్రులు ప్రోత్సాహం అందజేయాలని ప్రకాష్ పేర్కొన్నారు.