KMR: కేంద్రంలో BJP ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కృషి చేయాలని మాజీ MLA, బాన్సువాడ నియోజకవర్గ ఇంఛార్జ్ యెండల లక్ష్మీనారాయణ సూచించారు. BJP మండల అధ్యక్షుడు చందూరి హన్మాండ్లు ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై కార్యకర్తలను సమన్వయం చేశారు.