KDP: చెన్నూరు మండలంలో 45 టన్నుల యూరియా ఈ నెల 6వ తేదీ సోమవారం పంపిణీకి సిద్ధంగా ఉందని మండల వ్యవసాయ అధికారిని శ్రీదేవి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రామనపల్లి రైతు సేవా కేంద్రం ద్వారా రామనపల్లి, రాచినాయపల్లి రైతులకు పంపిణీ చేశారు. చెన్నూరులోని గ్రోమోర్ సెంటర్ ద్వారా కూడా యూరియా అందుబాటులో ఉంటుంది. రైతులు పట్టాదారు పాస్‌బుక్, ఆధార్‌తో హాజరుకావాలని సూచించారు.