ప్రకాశం: డీజే సౌండ్ సిస్టం అద్దెకు ఇచ్చే యాజమాన్యాలకు గిద్దలూరు అర్బన్ సీఐ సురేష్ వార్నింగ్ ఇచ్చారు. అనుమతులు లేకుండా డీజే సౌండ్ సిస్టం అద్దెకు ఇచ్చిన ఉపయోగించిన చర్యలు తప్పవని ఆదివారం మీడియాకు సురేష్ ఓ ప్రకటన విడుదల చేశారు. దీంతో నిబంధనలు ఉల్లంఘించి డీజే సౌండ్ సిస్టం అద్దెకు ఇచ్చే వారి డీజే సౌండ్ సిస్టం సీజ్ చేసి కోర్టుకు అప్పగిస్తామని హెచ్చరించారు.