GNTR: ప్రజలు ఏ ఆపదలోనైనా పోలీసులకు వెంటనే ఫోన్ చేస్తే 15 నిమిషాల్లో సమస్య పరిష్కరిస్తామని వెస్ట్ DSP అరవింద్ హామీ ఇచ్చారు. సోమవారం రాత్రి శ్రీనివాసరావుపేటలో సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. శాంతి భద్రతలకు అడ్డంకి కలిగించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మాదకద్రవ్యాల వినియోగం వలన కలిగే నష్టాలను ప్రజలకు తెలియజేశారు.