NLG: చిట్యాల మండలం వట్టిమర్తిలో శ్రీ వేణుగోపాల స్వామి వారి అష్టాదశ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 6 నుంచి 8వ తేదీ వరకు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపనున్నట్లు ఆలయ ఛైర్మన్ నర్రా మోహన్ రెడ్డి, ఆలయ అర్చకులు అక్కినేపల్లి భీష్మ చార్యులు తెలిపారు. 7న స్వామి వారి కళ్యాణం కన్నుల పండుగగా జరుగుతుందని, భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి విజయవంతం చేయాలని కోరారు.