BHNG: భువనగిరి మండలం రాయగిరి గ్రామానికి చెందిన గుడ్లపల్లి రాజు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. బీద కుటుంబం కావడంతో స్థానిక మాజీ వార్డ్ సభ్యుడు పల్లెర్ల యాదగిరి వారి కుటుంబాన్ని పరామర్శించి, పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.