KMM: ఖమ్మం బీజేపీ కార్యాలయంలో ఆదివారం స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరావు మాట్లాడుతూ.. ఎన్నికల ప్రక్రియ, అభ్యర్థుల పరిశీలన, సంస్థాగత నిర్మాణ అంశాలపై చర్చించారు. ఎన్నికలు ఏదైనా గెలుపే లక్ష్యంగా కృషి చేస్తూ ఖమ్మం జిల్లాలో కాషాయ జెండా ఎగురవేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.