SRD: సమాచార హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షుడు శ్రీధర్ డిమాండ్ చేశారు. సంగారెడ్డిలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సమాచార హక్కు చట్టం వారోత్సవాలను నిర్వహించాలని డిమాండ్ చేశారు. సహ చట్టం కింద దరఖాస్తు చేసుకున్న అధికారులు సరైన సమాచారం ఇవ్వడం లేదని ఆరోపించారు.