SKLM: బూర్జ మండలం రాజుల పేటలో మాజీ ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వప్రసాద్ మాతృమూర్తి ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని తెలుసుకున్న కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాన్ని దంపతులు ఆదివారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. వారితోపాటు రమేష్, సతీష్, తదితరులు పరామర్శించిన వారిలో ఉన్నారు.