RR: కార్మికుడు మృతి చెందిన ఘటన షాద్నగర్ నియోజకవర్గం కొత్తూరు మండల పరిధిలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. తీగాపూర్లోని ఓ కంపెనీలో పనిచేస్తున్న ఓం ప్రకాష్ అనే కార్మికుడు రాడ్లు తయారు చేస్తుండగా వేడి రాడ్ శరీరంలో చొచ్చుకుపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.