NZB: శ్రీరామ్ సాగర్ వద్ద పర్యాటకుల సందడి నెలకొంది. దసరా సెలవులు ముగియడంతో పాటు ఆదివారం కావడంతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ వద్ద పర్యాటకుల రద్దీ పెరిగింది. కుటుంబాలతో, స్నేహితులతో వచ్చిన సందర్శకులు ప్రాజెక్ట్ అందాలను ఆస్వాధించారు. నీటి మట్టం తగ్గినా ప్రకృతి సోయగాలు ఆకట్టుకున్నాయి. స్థానిక వ్యాపారులు అమ్మకాలతో సంతోషం వ్యక్తం చేశారు.