MBNR: తెలంగాణ మాల ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో స్వర్గీయ గడ్డం వెంకట్ స్వామి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు రాష్ట్ర ఉపాధ్యక్షులు దూమర్ల నిరంజన్ మాట్లాడుతూ.. బలహీన వర్గాల హక్కుల కోసం వెంకట్ స్వామి ఎంతో కృషి చేశారన్నారు. అనంతరం న్యాయవాది కృష్ణ మాట్లాడుతూ.. కార్మిక రంగాల్లో పనిచేసిన కార్మికులకు పెన్షన్, ఇతరత్రా సౌకర్యాలను ఏర్పాటు చేసిన ఘనత ఆయనకే దక్కిందన్నారు.