ప్రకాశం: దోర్నాల మండలం రామచంద్రకోట గ్రామ సమీపంలో తీగలేరు వాగులో గుర్తు తెలియని మృతదేహాన్ని ఆదివారం స్థానికులు గుర్తించారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహన్ని బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. మృతుడు ఎవరనేది తెలియరాలేదు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.