బిహార్‌లో నవంబర్ 22లోగా అసెంబ్లీ ఎన్నికలను పూర్తి చేస్తామని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. తొలిసారిగా EVMలలో పొందుపరిచే బ్యాలెట్ పేపర్లలో అభ్యర్థుల కలర్ ఫొటోలను ఉంచనున్నట్లు తెలిపింది. పుట్టిన తేదీ, పౌరసత్వానికి ఆధార్ ధ్రువీకరణ కాదని మరోసారి స్పష్టం చేసింది. చట్టానికి లోబడే ఆధార్‌ను ఉపయోగిస్తున్నామని ఈసీ తెలిపింది.