KDP: పులివెందుల మండలం అచ్చివెల్లి గ్రామ సమీపంలోని తాగునీటి పైపులైనుకు సంబంధించి బోరు మోటర్ వద్ద పైపుల లీకేజీతో నీరు వృధాగా పోతుంది. దీంతో తాగునీటి పైపులైన్ వద్ద తాగునీరు మురికి నీటిలో కలుషితమవుతుంది. దీంతో తాగునీరు కలుషితం రావడంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. ఈ విషయాన్ని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదని ప్రజలు వాపోతున్నారు.