డార్జిలింగ్‌లో వంతెన ప్రమాదం కారణంగా సంభవించిన ప్రాణనష్టం తీవ్ర బాధాకరమని ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు. భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడిన నేపథ్యంలో డార్జిలింగ్ పరిసర ప్రాంతాల పరిస్థితిని అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. బాధితులకు సాధ్యమైనంత సహాయం అందించడానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.