NZB: జిల్లా కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని కలెక్టర్ టీ. వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. ఆయన దుబ్బ ప్రాంతంలో నిర్మాణాలను పరిశీలించి, ప్రభుత్వ సంకల్పం మేరకు మున్సిపాలిటీల పరిధిలోనూ ఇళ్లను మంజూరు చేశామని తెలిపారు. నిర్మాణాలకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు.