VZM: కొత్తవలస పట్టణ కేంద్రంలోని తుమ్మికాపల్లి వద్ద ఓంకార ఆశ్రమ సమీపంలో కొత్తవలస నుంచి ఎస్.కోట వెళ్లే ఆటోపై చింతచెట్టు కొమ్మలు పడ్డాయి. ఆటోలో ఉన్న ముగ్గురు ప్రయాణికుల తలపై పడడంతో, తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు స్పందించి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. హుటాహుటిన అగ్నిమాపక దళం సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని చెట్టుకొమ్మలు తొలగించారు.