VZM: విజయనగరం ఉత్సవాల్లో భాగంగా కోట లోపల ఏర్పాటు చేసిన విద్యా వైజ్ఞానిక ప్రదర్శన అందర్నీ ఆకట్టుకుంది. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈ ప్రదర్శనను ప్రారంభించారు. ఈ ప్రదర్శనలో ప్రవేశపెట్టిన ప్రాజెక్టులను, నమూనాలను ఆసక్తిగా తిలకించారు. వాటి గురించి జిల్లా విద్యాశాఖ అధికారి మాణిక్యం నాయుడు వారికి వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అదితి, తదితరులు పాల్గొన్నారు.