ADB: ప్రజలకు ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న రేషన్ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసి విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని నార్నూర్ ఎస్సై అఖిల్ అన్నారు. మండలానికి చెందిన కోటగిరి విశాల్, చింతావార్ సత్యనారాయణ అనే వ్యక్తులు అక్రమంగా రేషన్ బియ్యం విక్రయిస్తుండడంతో బియ్యాన్ని స్వాధీనం చేసి కేసులు నమోదు చేశామన్నారు.