KNR: హుజురాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ట్రాపిక్ సిగ్నల్ లైట్లు ఏర్పాటు చేయాలని ప్రయాణీకులు కోరుతున్నారు. ఈ మార్గం గుండా నిత్యం వేలాది వాహనాలు, ప్రయాణిస్తుంటాయి. సిగ్నల్ లైట్స్ లేక పోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వాపోయారు. అధికారులు స్పందించి ట్రాఫిక్ సిగ్నల్ లైట్లు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.