విజయనగరం ఉత్సవాలలో భాగంగా స్థానిక కోటలో ఏర్పాటు చేసిన విజయనగరం జిల్లా మహనీయులు, యుద్ధ భూమిలో మరణించిన వీర జవాన్లతో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదివారం సందర్శించారు. వివిధ యుద్ధాలలో వీరగతి పొంది అమరులైన జవాన్లకు మంత్రి నమస్కరించి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు, ఎమ్మెల్యే అదితి పాల్గొన్నారు.