RR: పన్నీర్ బిర్యానీలో చికెన్ ముక్కలు దర్శనమిచ్చిన ఘటన షాద్నగర్లో చోటుచేసుకుంది. బాధితుడి వివరాలు.. పట్టణంలోని జడ్చర్ల రోడ్డులో ఉన్న ఓ హోటల్లో పన్నీర్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చాడు. బిర్యానీ తింటుండగా అందులో చికెన్ ముక్కలు కనిపించడంతో కస్టమర్ ఖంగుతిన్నాడు. నిర్వాహకులను అడగగా నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని, ఇలాంటి హోటళ్ల నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలన్నారు.