CTR: శాంతిపురం(M) గుండి శెట్టిపల్లి సమీపంలోని ఓ మామిడి తోటలో మునిదేవర కోసం ఏర్పాట్లు చేస్తుండగా తేనెటీగలు దాడి చేశాయి. దీంతో దేవర కోసం వచ్చిన వారు పరుగులు తీయగా పలువురు గాయపడ్డారు. తేనెటీగల దాడిలో తీవ్రంగా గాయపడ్డ 6 మందిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా మార్గమధ్యంలో గుండి శెట్టిపల్లికి చెందిన విశ్వనాథరెడ్డి (45) మృతి చెందాడు.