కృష్ణా: అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్‌ను కలిశారు. అమరావతిలోని డిప్యూటీ సీఎం కార్యాలయంలో ఆయనను కలసి తాను రచించిన సదాస్మరామి గ్రంధాన్ని బహుకరించారు. తెలుగు జాతిలో జన్మించిన మహోన్నత ప్రముఖులను స్మరించుకుంటూ ఈ గ్రంథం రచించినట్లు బుద్ధప్రసాద్ తెలిపారు.