MNCL: పద్మశాలీలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని పద్మశాలి సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు గాదాసు బాపు అన్నారు. ఆదివారం దండేపల్లి మండల కేంద్రంలో పద్మ శాలి భవనంలో ఆయన ప్రసంగించారు. మొదట నూతనంగా ఎన్నుకోబడిన మండల కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. రానున్న ZPTC, MPTC, సర్పంచ్, వార్డు స్థానాల్లో పద్మశాలీ కులస్తుల పోటీ చేయాలని ఆయన సూచించారు.