NRML: గ్రామంలో శాంతిభద్రతలు కాపాడుతూ, గ్రామస్థులు సోదర భావంతో మెలగాలని దిలావర్పూర్ ఎస్సై రవీందర్ సింగ్ అన్నారు. ఆదివారం న్యూ లోలం గ్రామంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల వేళ ప్రతి ఒక్కరూ నియమాలు పాటిస్తూ, సోదర భావంతో మెలగాలని, సైబర్ క్రైమ్ పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు.