PPM: కురుపాం (M) శివన్నపేట గురుకుల బాలికల పాఠశాలకు వారం రోజులపాటు సెలవులు ఇస్తున్నట్లు కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ఆదివారం తెలిపారు. రేపటి నుంచి వారం రోజులు సెలవులు ఇస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ముందస్తు జాగ్రత్తలు మెరుగైన వైద్యం కోసం జాండీస్ లక్షణాలున్న విద్యార్థినిలను KGHకు తరలించారు. ప్రతి విద్యార్థి రక్తనమూనాలను సేకరించామన్నారు.