అన్నమయ్య: టమోటా రైతులకు కూటమి ప్రభుత్వం చేసింది శూన్యమని ఏపీ కాంగ్రెస్ కమిటీ కిసాన్ సెల్ చైర్మన్ కామన ప్రభాకర్ రావు ఆరోపించారు. ఇవాళ మదనపల్లె టమోటా మార్కెట్‌ను ఆయన సందర్శించారు. అనంతరం పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ.. రైతులకు గిట్టుబాటు ధర దక్కడం లేదని తెలిపారు. దళారుల దోపిడీ యథేచ్ఛగా సాగుతుందన్నారు. ఉన్నతాధికారుల తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు.