NLG: చిట్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2001-02 పదవ తరగతి బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనంను నిర్వహించారు. చిట్యాల శివారులోని బాల నరసింహ స్వామి దేవస్థానం వద్ద ఏర్పాటు చేసిన ఈ సమ్మేళనానికి తమకు చదువు చెప్పిన ఉపాధ్యాయులను ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులను సన్మానించి కృతజ్ఞతను చాటుకున్నారు. ఒకరినొకరు పలకరించుకొని యోగక్షేమాలు తెలుసుకున్నారు.