ప్రకాశం: టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెంలో మంత్రి స్వామి తన క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి పలు సమస్యలపై వినతిపత్రాలు స్వీకరించారు. ఆదివారం మంత్రిని కలవడానికి కొండపి నియోజకవర్గం నుంచే కాకుండా పలు నియోజకవర్గాలవారు తమ సమస్యలను వినతి పత్రాల రూపంలో మంత్రికి ఇచ్చారు. స్పందించిన మంత్రి సమస్యలను వివరించి పరిష్కార దిశగా ప్రయత్నించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.