SRCL: రుద్రంగి మండల కేంద్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రుద్రంగిలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని, కాంగ్రెస్ జెండా ఎగరాలని ఆయన అన్నారు. కార్యకర్తలకు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, పలు సూచనలను ఆయన దిశా నిర్దేశం చేశారు.